Subject-Verb Agreement: 10 Essential Rules and 100+ Examples

Introduction

Have you ever read a sentence that just felt “off”, even if you couldn’t immediately point out why? Often, that uncomfortable feeling comes from a clash between the subject and the verb. Grammar is the skeleton of a language. It holds the words together and gives them shape. Among the many rules in English, Subject-Verb Agreement is arguably the most critical foundation for clear communication. 

మీరు వెంటనే ఎందుకోసం అని చెప్పలేకపోయినా, ఒక వాక్యం మీకు “అసహజంగా” లేదా “ఏదో తప్పు ఉంది” అనిపించిన సందర్భాలు మీకు ఎప్పుడైనా ఎదురయ్యాయా? తరచుగా, ఆ అసౌకర్యమైన భావన కర్త (విషయం) మరియు క్రియ మధ్య సంఘర్షణ నుండి వస్తుంది.

వ్యాకరణం అనేది ఒక భాష యొక్క అస్థిపంజరం లాంటిది. ఇది పదాలను కలిపి, వాటికి ఆకారాన్ని, ఆకృతిని ఇస్తుంది. ఆంగ్లంలోని అనేక నియమాలలో, Subject-Verb Agreement (కర్త-క్రియ ఒప్పందం) అనేది స్పష్టమైన కమ్యూనికేషన్‌కు అత్యంత కీలకమైన పునాది.

Whether you are chatting with friends or drafting a business proposal for a multinational client, getting this rule right is the difference between sounding fluent and sounding confused. Subject-Verb Agreement means that the verb in a sentence must match the subject in number (singular or plural) and person. 

మీరు స్నేహితులతో చాటింగ్ చేస్తున్నా లేదా బహుళజాతి క్లయింట్ కోసం వ్యాపార ప్రతిపాదనను వ్రాస్తున్నా, ఈ నియమాన్ని సరిగ్గా తెలుసుకోవడం అనేది, స్పష్టంగా మాట్లాడటం మరియు గందరగోళంగా అనిపించడం మధ్య వ్యత్యాసాన్ని తొలగిస్తుంది. కర్త-క్రియ ఒప్పందం అంటే వాక్యంలో Subject (కర్త) యొక్క సంఖ్య (ఏకవచనం లేదా బహువచనం) మరియు పర్సన్ (ప్రథమ/ద్వితీయ/తృతీయ) కు అనుగుణంగా క్రియ (Verb) మారడం. ఏకవచన సబ్జెక్ట్‌కు ఏకవచన క్రియ, బహువచన సబ్జెక్ట్‌కు బహువచన క్రియ వాడాలి.

In this blog article, we will break down exactly what subjects and objects are, how to ensure the verbs agree in number and person, and learn the important subject-verb agreement rules. Each section includes examples from daily conversations and business English to help you understand the practical usage.

ఈ బ్లాగ్ వ్యాసంలో, సబ్జెక్టు, కర్త, వస్తువు అంటే ఏమిటి, క్రియలు సంఖ్య మరియు వ్యక్తితో ఏకీభవిస్తాయని ఎలా నిర్ధారించుకోవాలి మరియు ముఖ్యమైన నియమాలు ఏమిటో మనం నేర్చుకుందాము. ప్రతి విభాగంలో రోజువారీ సంభాషణలు మరియు వ్యాపార ఆంగ్లంలో ఉదాహరణలు ఉన్నాయి. ఇవి మీకు ఆచరణాత్మక వినియోగాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడతాయి.

What is a Subject?

Before we can agree on anything, we need to know who is doing the action or talking in a sentence. In English grammar, the subject is the “doer” of the sentence. It is the person, place, thing, or idea that performs the action or that is being described. Without a subject, a sentence is usually incomplete. It usually appears before the verb.

మనం ఏదైనా విషయంపై అంగీకరించే ముందు, దేని గురించి అయినా ఏకీభవించే ముందు, ఒక వాక్యంలో చర్యను ఎవరు చేస్తున్నారో లేదా మాట్లాడుతున్నారో మనం తెలుసుకోవాలి. ఆంగ్ల వ్యాకరణంలో, Subject అనేది వాక్యానికి “కర్త”. ఇది వ్యక్తి, స్థలం, విషయం లేదా ఆలోచనను సూచిస్తుంది. ఇది చర్యను నిర్వహిస్తుంది లేదా వివరించబడుతోంది. కర్త (విషయం) లేకుండా, ఒక వాక్యం సాధారణంగా అసంపూర్ణంగా ఉంటుంది. కర్త సాధారణంగా క్రియకు ముందు కనిపిస్తుంది.

Examples

Here are examples showing the subject (in bold) in action.

  • Rohit plays cricket every Sunday. (రోహిత్ ప్రతి ఆదివారం క్రికెట్ ఆడతాడు.)
  • The children are playing outside. (పిల్లలు బయట ఆడుకుంటున్నారు.)
  • The manager approves the proposal. (మేనేజర్ ఆ ప్రతిపాదనను ఆమోదించారు.)
  • The team is working on the project. (బృందం ఆ ప్రాజెక్టుపై పనిచేస్తోంది.)
  • The company provides health insurance. (ఈ సంస్థ ఆరోగ్య బీమాను అందిస్తుంది.)
  • The clients expect quality service. (ఖాతాదారులు నాణ్యత కలిగిన సేవను ఆశిస్తారు.)

What is a Verb?

A verb is the part of a sentence that shows action, state, or occurrence. In a sentence, the verb comes after the subject and tells us what the subject does or what happens to the subject. Verbs can express physical actions (run, write), mental actions (think, believe), or states of being (is, seem).

Verb (క్రియ) అనేది ఒక వాక్యంలో చర్య, స్థితి లేదా సంఘటనను చూపించే ముఖ్యమైన భాగం. SVO నిర్మాణంలో, క్రియ కర్త తరువాత వస్తుంది మరియు కర్త ఏమి చేస్తుంది లేదా కర్తకు ఏమి జరుగుతుందో మనకు తెలియజేస్తుంది. క్రియలు భౌతిక చర్యలను (పరుగెత్తడం, రాయడం), మానసిక చర్యలను (ఆలోచించడం, నమ్మడం) లేదా ఉనికి యొక్క స్థితులను (ఉంది, అనిపించడం) వ్యక్తీకరించగలవు.

Understanding verbs is important because they give life to a sentence. Verbs change form based on tense and subject. The verb is crucial in subject-verb agreement. It decides the grammatical accuracy, clarity, and tense by matching the subject’s number (singular/plural) and person. 

క్రియలను అర్థం చేసుకోవడం ముఖ్యం ఎందుకంటే అవి ఒక వాక్యానికి ప్రాణం పోస్తాయి. క్రియలు కాలం మరియు కర్త ఆధారంగా రూపాన్ని మార్చుకుంటాయి. కర్త-క్రియ ఒప్పందంలో క్రియ చాలా ముఖ్యమైనది. ఇది కర్త సంఖ్య (ఏకవచనం/బహువచనం) మరియు వ్యక్తిని సరిపోల్చడం ద్వారా వ్యాకరణ ఖచ్చితత్వం, స్పష్టత మరియు కాలాన్ని నిర్ణయిస్తుంది. 

In the following examples, the bold words are verbs.

Examples:

  • She bought a new dress. (ఆమె ఒక కొత్త డ్రెస్ కొనుక్కుంది.)
  • The children are playing outside. (పిల్లలు బయట ఆడుకుంటున్నారు.)
  • The manager reviewed the report. (మేనేజర్ నివేదికను సమీక్షించారు.)
  • The company launched a new product. (కంపెనీ కొత్త ఉత్పత్తిని ప్రారంభించింది.)
  • The HR team conducts interviews. (HR బృందం ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది.)

What is an Object?

If the subject is the “doer”, the object is the “receiver”. The object is the noun or pronoun (person or thing) that receives the action of the verb. It usually comes after the verb. While Subject-Verb agreement doesn’t depend on the object, knowing the difference is vital so you don’t confuse the two when the sentence gets complicated. Not all sentences need an object.

Subject “కర్త” అయితే, Object (కర్మ లేదా వస్తువు) “గ్రహీత” అవుతుంది. వస్తువు అనేది క్రియ యొక్క చర్యను పొందే నామవాచకం లేదా సర్వనామం (వ్యక్తి లేదా విషయం). ఇది సాధారణంగా క్రియ తర్వాత వస్తుంది. కర్త-క్రియ ఒప్పందం వస్తువుపై ఆధారపడనప్పటికీ, వ్యత్యాసాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం. వాక్యం సంక్లిష్టంగా ఉన్నప్పుడు మీరు రెండింటినీ గందరగోళపరచకుండా ఉంటారు. అన్ని వాక్యాలకు కర్మ అవసరం లేదు.

In the following examples, the bold words are objects.

Examples:

  • I bought a new phone. (నేను కొత్త ఫోన్ కొన్నాను.)
  • She called her friend. (ఆమె తన స్నేహితురాలికి ఫోన్ చేసింది.)
  • We watched a movie. (మేము ఒక సినిమా చూశాము.)
  • The team prepared the report. (బృందం నివేదికను సిద్ధం చేసింది.)
  • He sent the email yesterday. (అతను నిన్న ఇమెయిల్ పంపాడు.)
  • They discussed the budget. (వారు బడ్జెట్ గురించి చర్చించారు.)

To know more about objects, key points, direct and indirect objects, read our blog, Basic Sentence Formation in English.

What is the Subject-Verb Agreement?

Now that we have identified the players, we need to look at the rules of the game. Subject-Verb Agreement simply means that the verb must agree with the subject in number and person. Subject and verb agreement is one of the most important grammar rules in English. Whether you are speaking in daily conversations, writing emails, preparing reports, or appearing for competitive exams, correct agreement between the subject and verb makes your communication clear, professional, and grammatically accurate.

మనం ఆటగాళ్లను గుర్తించాము కాబట్టి, ఇప్పుడు ఆట నియమాలను పరిశీలించాలి. కర్త-క్రియ ఒప్పందం అంటే క్రియ సంఖ్య మరియు వ్యక్తి పరంగా కర్తతో ఏకీభవించాలి. కర్త మరియు క్రియ ఒప్పందం అనేది ఆంగ్లంలో అత్యంత ముఖ్యమైన వ్యాకరణ నియమాలలో ఒకటి. మీరు రోజువారీ సంభాషణల్లో మాట్లాడుతున్నా, ఇమెయిల్‌లు రాస్తున్నా, నివేదికలను సిద్ధం చేస్తున్నా లేదా పోటీ పరీక్షలకు హాజరవుతున్నా, కర్త మరియు క్రియ మధ్య సరైన ఒప్పందం మీ సంభాషణను స్పష్టంగా, వృత్తిపరంగా మరియు వ్యాకరణపరంగా ఖచ్చితమైనదిగా చేస్తుంది. 

  • If the subject is Singular (one), the verb must be Singular. (Example: She runs.)
  • If the subject is Plural (more than one), the verb must be Plural. (Example: They run.)
  • కర్త ఏకవచనం (ఒకటి) అయితే, క్రియ ఏకవచనం అయి ఉండాలి. (ఉదాహరణ: ఆమె పరుగెత్తుతుంది.)
  • కర్త బహువచనం (ఒకటి కంటే ఎక్కువ) అయితే, క్రియ బహువచనం అయి ఉండాలి. (ఉదాహరణ: వారు పరుగెత్తుతారు.)

Let’s now look at the essential rules of subject-verb agreement. ఇప్పుడు కర్త-క్రియ ఒప్పందం యొక్క ముఖ్యమైన నియమాలను నేర్చుకుందాం.

Essential Rules of the Subject-Verb Agreement

Here are the ten important rules to remember in order to maintain the subject-verb agreement correctly in a sentence. ఒక వాక్యంలో కర్త-క్రియ ఒప్పందాన్ని సరిగ్గా నిర్వహించడానికి గుర్తుంచుకోవలసిన పది ముఖ్యమైన నియమాలు ఇక్కడ వివరించబడినాయి.

1. Basic Agreement

Singular subjects need singular verbs and plural subjects need plural verbs. ఏకవచన కర్త లకు ఏకవచన క్రియలు అవసరం మరియు బహువచన కర్త లకు బహువచన క్రియలు అవసరం. అనగా ఏకవచన కర్త కు ఏకవచన క్రియ, బహువచన కర్త కు బహువచన క్రియ వాడాలి.

A) Singular Subject: When a sentence begins with a singular subject, we add “-s” or “-es” to the main verb. A singular subject usually takes a singular verb. ఒక వాక్యం ఏకవచన కర్త తో ప్రారంభమైనప్పుడు, మనం ప్రధాన క్రియకు “-s” లేదా “-es” జోడిస్తాము. ఒక ఏకవచన విషయం సాధారణంగా ఏకవచన క్రియను తీసుకుంటుంది.

Examples:

  • The dog runs fast. [‘dog’ is singular (3rd person), therefore we have added ‘-s’ to the main verb (runs).] [కుక్క వేగంగా పరుగెడుతుంది. (‘కుక్క’ ఏకవచనం (3వ వ్యక్తి), కాబట్టి మనం ప్రధాన క్రియ (run) కు ‘-s’ జోడించాము.)]
  • The doll is beautiful. [‘doll’ is singular (3rd person), therefore we have used a singular verb (is).] [ఆ బొమ్మ అందంగా ఉంది. (‘బొమ్మ’ ఏకవచనం (3వ వ్యక్తి), కాబట్టి మనం ఏకవచన క్రియ (is) ను  ఉపయోగించాము.)]
  • This cake tastes delicious. (ఈ కేక్ రుచికరంగా ఉంది.) 
  • He goes to the gym. (అతను జిమ్‌కు వెళ్తాడు.) 
  • My brother works in an automobile company in Chennai. (మా అన్నయ్య చెన్నైలోని ఒక ఆటోమొబైల్ కంపెనీలో పనిచేస్తాడు.)
  • The manager approves the request. (మేనేజర్ అభ్యర్థనను ఆమోదించారు.)
  • The department handles compliance matters. (ఈ విభాగం అనుసరణ, నియమాలను పాటించడం లాంటి విషయాలను నిర్వహిస్తుంది.)
  • The proposal looks promising. (ఈ ప్రతిపాదన ఆశాజనకంగా ఉంది.)

B) Plural Subject: For plural subject, we do not add “-s” or “-es” to the main verb. A plural subject usually takes a plural verb. బహువచన కర్త కోసం, మనం ప్రధాన క్రియకు “-s” లేదా “-es” ను జోడించము. బహువచన కర్త సాధారణంగా బహువచన క్రియను తీసుకుంటుంది.

Examples:

  • The dogs run fast. [‘dogs’ is plural, therefore we have NOT added ‘-s’ to the verb (run).] [కుక్కలు వేగంగా పరిగెత్తుతాయి. (‘కుక్కలు’ బహువచనం, కాబట్టి మనం క్రియ (run) కు ‘-s’ ని జోడించలేదు.)]
  • The dolls are beautiful. [‘dolls’ is plural, therefore we have used a plural verb (are).] [బొమ్మలు అందంగా ఉన్నాయి. (‘బొమ్మలు’ బహువచనం, కాబట్టి మనం బహువచన క్రియ (are) ని ఉపయోగించాము.)]
  • The teams are collaborating effectively. (జట్లు సమర్థవంతంగా కలిసి పనిచేస్తున్నాయి.)
  • The results indicate improvement. (ఫలితాలు మెరుగుదలను సూచిస్తున్నాయి.)
  • The girls are playing volleyball. (అమ్మాయిలు వాలీబాల్ ఆడుతున్నారు.)
  • The students are talking to the lecturer. (విద్యార్థులు లెక్చరర్‌తో మాట్లాడుతున్నారు.)
  • Local buses run regularly to and from the campus. (స్థానిక బస్సులు క్యాంపస్‌కు మరియు అక్కడి నుండి క్రమం తప్పకుండా నడుస్తాయి.)
  • The company’s profits were 5 percent lower than last year. (కంపెనీ లాభాలు గత సంవత్సరం కంటే 5 శాతం తక్కువగా ఉన్నాయి.)

2. Compound Subjects

A) Two or more subjects joined by “and” usually take a plural verb. And (మరియు) తో కలిపిన రెండు లేదా అంతకంటే ఎక్కువ సబ్జెక్టులు సాధారణంగా బహువచన క్రియను తీసుకుంటాయి.

Subject-verb-agreement_6

Examples:

  • Ram and Shyam are friends. (రామ్ మరియు శ్యామ్ స్నేహితులు.) 
  • My friend and I have lived here for five years. (నేను మరియు నా స్నేహితుడు ఐదు సంవత్సరాలుగా ఇక్కడ నివసిస్తున్నాము.)
  • Rohan and Seema are playing chess. (రోహన్ మరియు సీమా చదరంగం ఆడుతున్నారు.)
  • The company and its partners are expanding operations. (కంపెనీ మరియు దాని భాగస్వాములు కార్యకలాపాలను విస్తరిస్తున్నారు.)
  • Focus and dedication are key to success. (ఏకాభిప్రాయం మరియు అంకితభావం విజయానికి కీలకం.) 
  • Pallavi and Priyanka are going to the gym. (పల్లవి మరియు ప్రియాంక జిమ్‌కు వెళ్తున్నారు.)
  • Tea and coffee are available in the kitchen. (వంటగదిలో టీ మరియు కాఫీ అందుబాటులో ఉన్నాయి.)
  • My brother and sister live in Hyderabad. (నా సోదరుడు మరియు సోదరి హైదరాబాద్‌లో నివసిస్తున్నారు.)
  • The manager and the supervisor have approved the proposal. (మేనేజర్ మరియు సూపర్‌వైజర్ ఈ ప్రతిపాదనను ఆమోదించారు.)
  • Sales and marketing work closely together. (సేల్స్ మరియు మార్కెటింగ్ విభాగాలు కలిసి పనిచేస్తాయి.)
  • The CEO and the CFO were present at the meeting. (సీఈఓ మరియు సీఎఫ్‌ఓ సమావేశంలో పాల్గొన్నారు.)

B) If they refer to one person, idea, concept, thing, etc., use a singular verb. ఒకవేళ ఈ రెండు సబ్జెక్టులు ఒకే వ్యక్తి, ఒకే ఆలోచన, భావన, విషయం మొదలైనవాటిని సూచిస్తే, ఏకవచన క్రియను ఉపయోగించండి. 

Examples:

  • Bread and butter is my favorite breakfast. (One common dish) [బ్రెడ్ మరియు వెన్న నాకు ఇష్టమైన అల్పాహారం. (ఒకే సాధారణ వంటకం)]
  • Rice and curry is served at lunch. (One meal combination) [మధ్యాహ్న భోజనంలో అన్నం మరియు కూర వడ్డిస్తారు. (ఒకే భోజనం కలయిక)]
  • Peanut butter and jelly is a popular sandwich filling. (One food combination) [వేరుశెనగ వెన్న మరియు జెల్లీ ఒక ప్రసిద్ధ శాండ్‌విచ్ ఫిల్లింగ్. (ఒకే ఆహార కలయిక)]
  • Slow and steady wins the race. (One combined idea) [నెమ్మదిగా మరియు స్థిరంగా సాగినపుడు రేసును గెలుస్తారు. (ఒకే మిశ్రమ ఆలోచన)]
  • Time and tide waits for no man. (Proverbial expression) [కాలం మరియు ఆటుపోట్లు ఎవరి కోసం వేచి ఉండవు. (సామెత వ్యక్తీకరణ)]
  • The writer and director is arriving today. (One person with two roles) [రచయిత మరియు దర్శకుడు ఈ రోజు వస్తున్నాడు. (రెండూ ఒకే వ్యక్తి)]
  • The founder and chairman is speaking today. (Same person) [కంపెనీ వ్యవస్థాపకుడు మరియు ఛైర్మన్ ఈ రోజు మాట్లాడుతున్నాడు. (రెండూ ఒకే వ్యక్తి)]
  • Law and order is essential for a peaceful society. (One concept) [శాంతియుత సమాజానికి శాంతిభద్రతలు అవసరం. (ఒకే భావన)]

C) When two subjects are joined by “or”, the verb agrees with the subject closest to the verb (proximity rule). The verb follows the number (singular or plural) of the nearest subject. రెండు విషయాలను ‘or’ (లేదా) తో కలిపినప్పుడు, క్రియకు దగ్గరగా ఉన్న కర్త తో (సామీప్య నియమం) క్రియ ఏకీభవిస్తుంది. క్రియ సమీప విషయం యొక్క సంఖ్యను (ఏకవచనం లేదా బహువచనం) అనుసరిస్తుంది.

Examples:

  • Tea or coffee is fine for me. (నాకు టీ లేదా కాఫీ ఏదైనా ఫర్వాలేదు.)
  • The manager or the employees are responsible. (మేనేజర్ లేదా ఉద్యోగులు బాధ్యత వహిస్తారు.)
  • The employees or the manager is responsible. (ఉద్యోగులు లేదా మేనేజర్ బాధ్యత వహిస్తాడు.)
  • Either the CEO or the directors have to decide. (సీఈఓ లేదా డైరెక్టర్లు నిర్ణయం తీసుకోవాలి.) 

D) Intervening phrases: Phrases between the subject and verb (for example, along with, as well as, accompanied by) do not change the number of the first subject. The verb agrees with the first subject. These phrases add extra information. They do not make the subject plural. కర్త మరియు క్రియ మధ్య ఉన్న పదబంధాలు (ఉదాహరణకు, తోడుగా, అలాగే, కలిసి) మొదటి కర్త యొక్క సంఖ్యను మార్చవు. క్రియ మొదటి కర్త తో ఏకీభవిస్తుంది. ఈ పదబంధాలు అదనపు సమాచారాన్ని జోడిస్తాయి. అవి కర్త ను బహువచనం చేయవు.

Examples:

  • My brother, as well as my friends, is coming today. (ఈ రోజు నా సోదరుడు, అలాగే నా స్నేహితులు కూడా, వస్తున్నాడు.)
  • The teacher, as well as the students, was excited. (టీచర్, అలాగే విద్యార్థులు కూడా, ఎంతో ఉత్సాహంగా వున్నాడు.)
  • Priya, as well as her cousin, has arrived. (ప్రియా, అలాగే ఆమె కజిన్, వచ్చింది.)
  • The managers, as well as the team members, were informed. (మేనేజర్ లకు, అలాగే బృంద సభ్యులకు, సమాచారం అందించారు.)
  • The CEO, as well as the board members, has approved the plan. (సీఈఓ, అలాగే బోర్డు సభ్యులు కూడా, ప్రణాళికను ఆమోదించాడు.)
  • My father, along with my uncles, is visiting us. (నా తండ్రి, నా మామలతో కలిసి, మమ్మల్ని సందర్శిస్తున్నాడు.)
  • The children, along with their friends, were playing outside. (పిల్లలు, వారి స్నేహితులతో కలిసి బయట ఆడుకుంటున్నారు.)
  • Rohan, along with his classmates, has completed the project. (రోహన్, తన క్లాస్‌మేట్స్‌తో కలిసి, ప్రాజెక్ట్‌ను పూర్తి చేశాడు.)
  • The manager, along with the HR team, is conducting interviews. (మేనేజర్, HR బృందంతో కలిసి, ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాడు.)
  • The director, along with the executives, was present at the conference. (దర్శకుడు, కార్యనిర్వాహకులతో కలిసి, సమావేశంలో పాల్గొన్నాడు.)
  • The report accompanied by charts is presented at the seminar. (చార్ట్‌లతో కూడిన నివేదికను సెమినార్‌లో ప్రదర్శించ బడింది.)

3. Indefinite Pronouns

A) Some indefinite pronouns like anybody, anyone, everybody, everyone, somebody, someone, nobody, no one, whoever, whomsoever can cause confusion because they seem to be referring to a group of people or things. We tend to use third person plural verbs, but remember that they take third person singular verbs. The pronoun “both” takes a plural verb. 

కొన్ని అనిశ్చిత సర్వనామాలు (anybody, anyone, everybody, everyone, somebody, someone, nobody, no one, whoever, whomsoever) వంటివి గందరగోళాన్ని కలిగిస్తాయి ఎందుకంటే అవి వ్యక్తుల సమూహాన్ని లేదా వస్తువులను సూచిస్తున్నట్లు అనిపిస్తుంది. మనం మూడవ వ్యక్తి బహువచన క్రియలను ఉపయోగిస్తాము, కానీ అవి మూడవ వ్యక్తి ఏకవచన క్రియలను తీసుకుంటాయని గుర్తుంచుకోండి. సర్వనామం “both” బహువచన క్రియను తీసుకుంటుంది.   

Examples:

  • Everyone has a notebook. (ప్రతి ఒక్కరి వద్ద నోట్‌బుక్ ఉంది.) 
  • Everyone has completed the task. (ప్రతి ఒక్కరూ పనిని పూర్తి చేశారు.)
  • Everybody knows the answer. (ప్రతి ఒక్కరికీ సమాధానం తెలుసు.)
  • Everyone has a ticket. (ప్రతి ఒక్కరి వద్ద టికెట్ ఉంది.) 
  • Everyone is responsible for meeting the deadlines. (గడువు లోగా పని పూర్తిచేయడానికి ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలి.)
  • Both these books are mine. (ఈ రెండు పుస్తకాలు నావి.)
  • Both the women were French. (ఆ ఇద్దరు మహిళలు ఫ్రెంచ్ వారు.)
  • Both my children are studying in the same school. (నా ఇద్దరు పిల్లలు ఒకే పాఠశాలలో చదువుతున్నారు.)  

B) Some indefinite pronouns like one, each, every, either, neither, other use qualifying information that can make subject-verb agreement confusing. When we come across such tricky pronouns, use a singular verb. ‘Neither of’ and ‘either of’ are followed by a singular verb. one, each, every, either, neither, other వంటి కొన్ని నిరవధిక సర్వనామాలు కర్త-క్రియ ఒప్పందాన్ని గందరగోళపరిచే అదనపు సమాచారాన్ని ఉపయోగిస్తాయి. మనం అలాంటి తిక మక పెట్టే సర్వనామాలను చూసినప్పుడు, ఏకవచన క్రియను ఉపయోగించాలి. అలాగే ‘neither of’ మరియు ‘either of’ తర్వాత ఏకవచన క్రియ ఉంటుంది.

  • One of our students have gone to Germany. (Incorrect)
  • One of our students has gone to Germany. (Correct) (మా విద్యార్థులలో ఒకతను జర్మనీకి వెళ్ళాడు.)

In this sentence, the auxiliary verb (has, have) should be conjugated with the indefinite pronoun ‘one’ (singular) instead of ‘students’ (plural). ‘One’ is the subject of the sentence, while ‘of our students’ is an adjectival prepositional phrase that describes it. Let’s look at some more examples. ఈ వాక్యంలో, సహాయక క్రియ (has, have) ను ‘students’ (బహువచనం) కు బదులుగా నిరవధిక సర్వనామం ‘one’ (ఏకవచనం) తో కలిపి ఉపయోగించాలి. ‘One’ అనేది వాక్యం యొక్క విషయం, అయితే ‘of our students’ అనేది దానిని వివరించే విశేషణ పూర్వ పదబంధం. మరికొన్ని ఉదాహరణలను చూద్దాం.

Subject-verb-agreement_7

Examples:

  • Every state elects its own Chief Minister. (ప్రతి రాష్ట్రం దాని స్వంత ముఖ్యమంత్రిని ఎన్నుకుంటుంది.)
  • Each item is carefully checked. (ప్రతి అంశాన్ని జాగ్రత్తగా తనిఖీ చేస్తారు.)
  • Each employee receives a bonus. (ప్రతి ఉద్యోగికి బోనస్ లభిస్తుంది.)
  • Every child was given a gift. (ప్రతి బిడ్డకు ఒక బహుమతి ఇవ్వబడింది.)
  • One of my friends is coming. (నా స్నేహితులలో ఒకరు వస్తున్నారు.)
  • One of the managers has resigned. (మేనేజర్లలో ఒకరు రాజీనామా చేశారు.)
  • Each of the students has a book. (ప్రతి విద్యార్థి దగ్గర ఒక పుస్తకం ఉంది.)
  • Each of the candidates was interviewed. (ప్రతి అభ్యర్థిని ఇంటర్వ్యూ చేశారు.)
  • Each of the students has submitted homework. (ప్రతి విద్యార్థి హోంవర్క్ సమర్పించారు.)
  • Each employee has signed the form. (ప్రతి ఉద్యోగి ఫారమ్‌లో సంతకం చేశారు.)
  • Neither answer is correct. (ఏ సమాధానం సరైనది కాదు.) 
  • Neither candidate was selected for the position. (ఏ అభ్యర్థినీ ఆ పదవికి ఎంపిక చేయలేదు.)
  • Neither of my parents speaks English. (నా తల్లిదండ్రులిద్దరికీ ఇంగ్లీష్ రాదు.)
  • Neither of them is ready. (వాళ్ళలో ఎవరూ సిద్ధంగా లేరు.)

4. Uncountable Nouns

A) Singular form: Some nouns exist in singular form and always take a singular verb.  They may refer to a group, a field of study, an idea, or an uncountable concept. Common examples are information, advice, furniture, luggage, equipment, machinery, knowledge, traffic, etc. But, we can use expressions like ‘a piece of advice’, ‘a piece of equipment’, ‘a grain of rice’, etc.

కొన్ని నామవాచకాలు ఏకవచన రూపంలో ఉంటాయి మరియు ఎల్లప్పుడూ ఏకవచన క్రియను తీసుకుంటాయి. అవి ఒక సమూహం, అధ్యయన రంగాన్ని, ఒక ఆలోచనను లేదా లెక్కించలేని భావనను సూచించవచ్చు. ఉదాహరణకు సమాచారం, సలహా, ఫర్నిచర్, సామాను, పరికరాలు, యంత్రాలు, జ్ఞానం, ట్రాఫిక్ మొదలైనవి. కానీ, మనం ‘ఒక సలహా’, ‘ఒక పరికరం’, ‘ఒక బియ్యపు గింజ’ మొదలైన వ్యక్తీకరణలను ఉపయోగించవచ్చు.

Examples:

  • The information is accurate. (సమాచారం ఖచ్చితమైనది.)
  • Her advice was very helpful. (ఆమె సలహా చాలా ఉపయోగకరంగా ఉంది.)
  • The furniture is made of teak wood. (ఫర్నిచర్ టేకు కలపతో తయారు చేయబడింది.)
  • All the equipment is ready for installation. (అన్ని పరికరాలు సంస్థాపనకు సిద్ధంగా ఉన్నాయి.)
  • Information is available on the website. (వెబ్‌సైట్‌లో సమాచారం అందుబాటులో ఉంది.)
  • Advice is useful in this situation. (ఈ పరిస్థితిలో సలహా ఉపయోగకరంగా ఉంటుంది.)
  • Furniture is expensive here. (ఇక్కడ ఫర్నిచర్ ఖరీదైనది.)
  • Luggage is placed near the entrance. (సామాను ప్రవేశ ద్వారం దగ్గర ఉంచబడింది.) 

B) Emotions and qualities: Some nouns refer to emotions, qualities, states, ideas, or concepts and are treated as singular. Common examples are honesty, happiness, progress, education, intelligence, courage, etc. కొన్ని నామవాచకాలు భావోద్వేగాలు, లక్షణాలు, గుణాలు, స్థితులు, ఆలోచనలు లేదా భావనలను సూచిస్తాయి మరియు వాటిని ఏకవచనంగా పరిగణిస్తారు. ఉదాహరణకు నిజాయితీ, ఆనందం, పురోగతి, విద్య, తెలివితేటలు, ధైర్యం మొదలైనవి.

Examples:

  • Honesty is the best policy. (నిజాయితీ ఉత్తమ విధానం.)
  • Education is essential for growth. (అభివృద్ధికి విద్య అత్యవసరం.)
  • Progress is slow but steady. (పురోగతి నెమ్మదిగా ఉంటుంది కానీ స్థిరంగా ఉంటుంది.)
  • Her intelligence is impressive. (ఆమె తెలివితేటలు ఆకట్టుకుంటాయి.)

C) Academic subjects and fields of study: Some names of subjects end in “-ics” but are treated as singular when referring to a field of study. Common examples are mathematics, physics, economics, politics, statistics, etc. కొన్ని విద్యా విషయాలు మరియు అధ్యయన రంగాల పేర్లు “-ics” తో ముగుస్తాయి కానీ అధ్యయన రంగాన్ని సూచించేటప్పుడు ఏకవచనంగా పరిగణించబడతాయి. సాధారణ ఉదాహరణలు గణితం, భౌతిక శాస్త్రం, ఆర్థిక శాస్త్రం, రాజకీయాలు, సంఖ్యా శాస్త్రం, గణాంకాలు మొదలైనవి. 

Examples:

  • Mathematics is my favorite subject. (గణితం నాకు ఇష్టమైన విద్యా విషయం.)
  • Economics is an important discipline in business studies. (వ్యాపార అధ్యయనాలలో ఆర్థిక శాస్త్రం ఒక ముఖ్యమైన విభాగం.)
  • Physics is difficult for some students. (కొంతమంది విద్యార్థులకు భౌతిక శాస్త్రం కష్టంగా ఉంటుంది.)
  • Statistics is useful for data analysis. (singular – when referring to the subject) (డేటా విశ్లేషణకు గణాంకాలు ఉపయోగపడతాయి.)
  • The statistics are shocking. (plural – when referring to numerical data) (ఈ గణాంకాలు చాలా ఆందోళన కలిగిస్తున్నాయి.)
  • Statistics show that more people are able to ride a bicycle. (plural) (ఎక్కువ మంది సైకిల్ తొక్కగలరని గణాంకాలు సూచిస్తున్నాయి.)

D) Names of diseases, games, books, news, and movies: Some of these nouns end in “-s” but are grammatically considered as singular. Examples are measles, diabetes, politics, billiards, etc. వ్యాధులు, ఆటలు, పుస్తకాలు, వార్తలు మరియు సినిమాల పేర్లను సూచించే నామవాచకాలలో కొన్ని “-s” తో ముగుస్తాయి కానీ వ్యాకరణపరంగా ఏకవచనంగా పరిగణించబడతాయి. ఉదాహరణలు తట్టు/పొంగు వ్యాధి, డయాబెటిస్, రాజకీయాలు, బిలియర్డ్స్ మొదలైనవి.

Examples:

  • Measles is a contagious disease. (తట్టు/పొంగు ఒక అంటు వ్యాధి.)
  • Diabetes is a chronic health condition. (మధుమేహం ఒక దీర్ఘకాలిక ఆరోగ్య పరిస్థితి.)
  • Billiards is a cue sport played on a table. (బిలియర్డ్స్ అనేది టేబుల్ మీద ఆడే క్యూ క్రీడ.)
  • The news is surprising today. (ఈ రోజు వార్తలు ఆశ్చర్యకరంగా ఉన్నాయి.)
  • Politics is a sensitive topic. (రాజకీయాలు సున్నితమైన అంశం.)
  • The Arabian Nights is a famous collection of folk tales compiled in Arabic. (అరేబియన్ నైట్స్ అనేది అరబిక్‌లో సంకలనం చేయబడిన జానపద కథల ప్రసిద్ధ సేకరణ.)
  • True Lies is an action-comedy film directed by James Cameron. (ట్రూ లైస్ అనేది జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహించిన యాక్షన్-కామెడీ చిత్రం.)

5. Nouns That Exist in Plural Form

The nouns like annals, bellows, binoculars, pincers, tongs, scissors, spectacles, proceedings, trousers, pantaloons, pliers, premises, and wages are treated as plural nouns in English. Therefore, they take plural verbs (are, were, have, etc.). These nouns usually refer to tools with two joined parts (scissors, pliers, tongs, pincers), clothing items with two leg pieces (trousers, pantaloons), and optical devices with two lenses (binoculars, spectacles). Even though they refer to one object, they are grammatically plural.

Subject-verb-agreement_8

annals, bellows, binoculars, pincers, tongs, scissors, spectacles, proceedings, trousers, pantaloons, pliers, premises, మరియు wages వంటి నామవాచకాలను ఆంగ్లంలో బహువచన నామవాచకాలుగా పరిగణిస్తారు. అందువల్ల, అవి బహువచన క్రియలను (are, were, have) తీసుకుంటాయి. ఈ నామవాచకాలు సాధారణంగా రెండు కలిపిన భాగాలు కలిగిన సాధనాలను (scissors, pliers, tongs, pincers), రెండు లెగ్ పీస్‌లు కలిగిన దుస్తులు (trousers, pantaloons) మరియు రెండు లెన్స్‌లు కలిగిన ఆప్టికల్ పరికరాలను (binoculars, spectacles) సూచిస్తాయి. అవి ఒకే వస్తువును సూచిస్తున్నప్పటికీ, వ్యాకరణపరంగా బహువచనం. 

Examples: 

  • The scissors are sharp. (కత్తెరలు పదునుగా ఉన్నాయి.)
  • The pincers are kept in the toolbox. (పట్టుకార్లు టూల్‌బాక్స్‌లో ఉంచబడతాయి.)
  • The trousers are expensive. (ప్యాంటు లు ఖరీదుగా ఉన్నాయి.)
  • Binoculars are useful for birdwatching. (బైనాక్యులర్‌లు పక్షులను చూడటానికి ఉపయోగపడతాయి.)
  • The premises are secured. (ఈ ప్రాంగణం సురక్షితంగా ఉంటుంది.)
  • The bellows are used to blow air into the fire. (గాలిని మంటల్లోకి ఊదడానికి కొలిమి తిత్తులను ఉపయోగిస్తారు.)
  • The premises are under CCTV surveillance. (ఈ ప్రాంగణం CCTV నిఘాలో ఉంది.)
  • The workers’ wages have increased this year. (ఈ సంవత్సరం కార్మికుల వేతనాలు పెరిగాయి.)
  • The proceedings were conducted professionally. (విచారణ లు వృత్తిపరంగా నిర్వహించబడ్డాయి.)

6. Collective Nouns

Collective nouns usually take a singular verb if acting as a unit. If the subject is a collective noun, such as family, council, team, board, committee, jury, crew, mob, etc., then use a singular verb. సామూహిక నామవాచకాలు లేదా సమిష్టి నామవాచకాలు సాధారణంగా ఒక యూనిట్‌గా పనిచేస్తే ఏకవచన క్రియను తీసుకుంటాయి. విషయం అనేది కుటుంబం, మండలి, జట్టు, బోర్డు, కమిటీ, జ్యూరీ, సిబ్బంది, జనసమూహం మొదలైన సామూహిక నామవాచకం అయితే, అప్పుడు ఏకవచన క్రియను ఉపయోగించాలి. 

Examples: 

  • The team wins the match. (‘Team’ is treated as one unit here) (జట్టు మ్యాచ్‌లో గెలుస్తుంది.)
  • The council has elected its President. (కౌన్సిల్ దాని అధ్యక్షుడిని ఎన్నుకుంది.)
  • The committee has decided to close the facility. (కమిటీ ఆ సదుపాయాన్ని మూసివేయాలని నిర్ణయించింది.)
  • The mob was preparing to storm the government building. (ఆ గుంపు ప్రభుత్వ భవనాన్ని ముట్టడించడానికి సిద్ధమవుతోంది.)  
  • The jury has reached a decision. (న్యాయనిర్ణేతల బృందం ఒక నిర్ణయానికి వచ్చింది.)
  • The family enjoys dinner at a nearby restaurant. (ఆ కుటుంబం సమీపంలోని రెస్టారెంట్‌లో విందు ఆరగిస్తుంది.)
  • The committee consists of six members. (ఈ కమిటీలో ఆరుగురు సభ్యులు ఉన్నారు.)
  • The board meets every month. (బోర్డు ప్రతి నెలా సమావేశమవుతుంది.)
  • The team is working diligently to complete the project by this Friday. (ఈ శుక్రవారం నాటికి ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడానికి బృందం శ్రద్ధగా పనిచేస్తోంది.)

7. Correlative Conjunctions

Correlative Conjunctions or Paired Conjunctions are sets of conjunctions that are always used together. Some of the most common correlative conjunctions are “either … or”, “neither … nor”, ” not only … but also”, “just as … so”, “whether … or” and “not … but”.

అనుసంధాన పదాలు లేదా పద బంధాలు అనేవి ఎల్లప్పుడూ ఒక్కటిగా లేదా కలిపి ఉపయోగించే సముదాయాల లేదా పద బంధాలు సమితి. అత్యంత సాధారణ అనుసంధాన పద బంధాలు కొన్ని “either … or”, “neither … nor”, “not only … but also”, “just as … so”, “whether … or” మరియు “not … but”.

When correlative conjunctions are used, consider the noun or pronoun nearer to the verb, and use a singular verb or a plural verb accordingly. The verb agrees with the noun nearest to the verb. If the noun nearer to the verb is singular, then use a singular verb. If the noun nearer to the verb is plural, then use a plural verb.

అనుసంధాన పద బంధాలను ఉపయోగించినప్పుడు, క్రియకు దగ్గరగా ఉన్న నామవాచకం లేదా సర్వనామాన్ని పరిగణించండి మరియు తదనుగుణంగా ఏకవచన క్రియ లేదా బహువచన క్రియను ఉపయోగించండి. క్రియకు దగ్గరగా ఉన్న నామవాచకం ఏకవచనం అయితే, ఏకవచన క్రియను ఉపయోగించండి. క్రియకు దగ్గరగా ఉన్న నామవాచకం బహువచనం అయితే, బహువచన క్రియను ఉపయోగించండి.

Examples: 

  • Neither Divya nor her friends are coming. (Verb agrees with ‘friends’) (దివ్య లేదా ఆమె స్నేహితులు ఎవరూ రావడం లేదు.) 
  • Neither Rahul nor his friend was hurt. (రాహుల్ గానీ అతని స్నేహితుడు గానీ గాయపడలేదు.)
  • Neither they nor I was there at that time. (ఆ సమయంలో వారు కానీ నేను కానీ అక్కడ లేము.)
  • Either the student or her parents have attended the event. (విద్యార్థి లేదా ఆమె తల్లిదండ్రులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.)
  • Either they or she has mistaken the date. (వారు లేదా ఆమె తేదీని తప్పుగా అర్థం చేసుకున్నారు.)
  • Neither the manager nor the employees are ready for the meeting. (మేనేజర్ గానీ ఉద్యోగులు గానీ సమావేశానికి సిద్ధంగా లేరు.)
  • Neither the teachers nor the principal is available today. (ఉపాధ్యాయులు గానీ, ప్రిన్సిపాల్ గానీ ఈరోజు అందుబాటులో లేరు.)
  • Neither my friends nor I am responsible for this error. (ఈ లోపానికి నేను లేదా నా స్నేహితులు బాధ్యత వహించము.)
  • Either the CEO or the directors are attending the conference. (CEO లేదా డైరెక్టర్లు సమావేశానికి హాజరవుతున్నారు.)
  • Either the students or the teacher is presenting today. (విద్యార్థులు లేదా ఉపాధ్యాయుడు ఈరోజు ప్రెజెంట్ చేస్తున్నారు.)
  • Not only the manager but also the staff was present. (మేనేజర్ మాత్రమే కాదు, సిబ్బంది కూడా హాజరయ్యారు.)
  • Not only the teachers but also the principal is available. (టీచర్లు మాత్రమే కాదు, ప్రిన్సిపాల్ కూడా అందుబాటులో ఉన్నారు.)
  • Not only the CEO but also the directors are attending. (CEO మాత్రమే కాదు, డైరెక్టర్లు కూడా హాజరవుతున్నారు.)

8. Time, Amount, and Distance

When measurements of time, money, distance, weight, or quantity are expressed as a single total amount or single unit, we treat it as one unit. Therefore, it takes a singular verb, even though the noun looks plural (years, rupees, dollars, kilometers, etc.). When they refer to individual items separately, use a plural verb. Decide the verb form based on the context.

సమయం, డబ్బు, దూరం, బరువు లేదా పరిమాణం యొక్క కొలతలు ఒకే మొత్తం లేదా ఒకే యూనిట్‌గా వ్యక్తీకరించినప్పుడు, మనము దానిని ఒక యూనిట్‌గా పరిగణిస్తాము. అందువల్ల, నామవాచకం బహువచనం (సంవత్సరాలు, రూపాయిలు, డాలర్లు, కిలోమీటర్లు మొదలైనవి) గా కనిపించినప్పటికీ, ఇది ఏకవచన క్రియను తీసుకుంటుంది. అలాగే వ్యక్తిగత అంశాలను విడిగా సూచించినప్పుడు, బహువచన క్రియను ఉపయోగించాలి. సందర్భాన్ని బట్టి క్రియా రూపాన్ని నిర్ణయించాలి.

Examples:

  • Ten thousand rupees is not enough to buy that laptop. (ఆ ల్యాప్‌టాప్ కొనడానికి పది వేల రూపాయలు సరిపోవు.)
  • Twenty kilometers is too far for us to walk. (ఇరవై కిలోమీటర్లు నడవడానికి మాకు చాలా దూరం.)
  • Three hours is sufficient to complete this examination. (ఈ పరీక్షను పూర్తి చేయడానికి మూడు గంటలు సరిపోతుంది.)
  • Fifty kilograms is the maximum weight allowed on this flight. (ఈ విమానంలో అనుమతించబడే గరిష్ట బరువు యాభై కిలోగ్రాములు.)
  • Five years is a long time to wait for a promotion. (ప్రమోషన్ కోసం ఐదు సంవత్సరాలు వేచి ఉండడం చాలా ఎక్కువ సమయం.)
  • Two weeks is enough for the team to finish the project. (ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి బృందానికి రెండు వారాలు సరిపోతుంది.)
  • In total, twenty rupees are on the table. (Refers to individual notes/coins) [మొత్తంగా, ఇరవై రూపాయలు టేబుల్‌పై ఉన్నాయి. (వేర్వేరు నోట్లు/నాణేలను సూచిస్తుంది)]
  • Four days were marked as holidays in this month. (Refers to four separate days) [ఈ నెలలో నాలుగు రోజులు సెలవులుగా గుర్తించబడ్డాయి. (నాలుగు వేర్వేరు రోజులను సూచిస్తుంది)]

9. Sentences Beginning with Specific Words/Phrases

A) Sentences Beginning with “Here” and “There”: When a sentence begins with “Here” or “There”, the verb agrees with the real subject that comes after the verb and not with “here” or “there”. In English, “here” is not the subject of the sentence. It is an introductory word (an adverb). The real subject comes after the verb, so the verb must agree with that subject. If the subject is singular, use a singular verb. If the subject is plural, use a plural verb. Identify the real subject first before choosing the verb.

ఒక వాక్యం “ఇక్కడ” లేదా “అక్కడ” తో ప్రారంభమైనప్పుడు, క్రియ “ఇక్కడ” లేదా “అక్కడ” తో కాకుండా క్రియ తర్వాత వచ్చే నిజమైన కర్త లేదా విషయం (subject) తో ఏకీభవిస్తుంది. ఆంగ్లంలో, “ఇక్కడ” అనేది వాక్యం యొక్క విషయం కాదు. ఇది ఒక పరిచయ పదం (క్రియా విశేషణం) మాత్రమే. నిజమైన విషయం క్రియ తర్వాత వస్తుంది, కాబట్టి క్రియ ఆ విషయంకి అనుగుణంగా ఉండాలి, ఆ విషయంతో ఏకీభవించాలి. విషయం ఏకవచనం అయితే, ఏకవచన క్రియను ఉపయోగించాలి. విషయం బహువచనం అయితే, బహువచన క్రియను ఉపయోగించాలి. క్రియను ఎంచుకునే ముందు మొదట నిజమైన కర్త లేదా విషయాన్ని గుర్తించాలి.

Examples:

  • Here is the report you requested. (మీరు అభ్యర్థించిన నివేదిక ఇక్కడ ఉంది.)
  • Here are the documents you asked for. (మీరు అడిగిన పత్రాలు ఇక్కడ ఉన్నాయి.)
  • Here comes the bus. (ఇదిగో బస్సు వస్తుంది.)
  • Here come the students who won the competition. (పోటీలో గెలిచిన విద్యార్థులు ఇక్కడ ఉన్నారు.)
  • Here is your pen, and here are your keys. (ఇదిగో మీ పెన్ను మరియు మీ తాళపు చెవులు ఇక్కడ ఉన్నాయి.)
  • There is a problem with my phone. (నా ఫోన్‌లో సమస్య ఉంది.)
  • There is an interesting movie on TV. (టీవీలో ఒక ఆసక్తికరమైన సినిమా ఉంది.)
  • There are two guests at the door. (తలుపు వద్ద ఇద్దరు అతిథులు ఉన్నారు.)
  • There are three pending orders. (మూడు ఆర్డర్లు పెండింగ్‌లో ఉన్నాయి.)
  • There are two pens and a book on the table. (టేబుల్ మీద రెండు పెన్నులు మరియు ఒక పుస్తకం ఉన్నాయి.)
  • There were multiple issues in the system. (సిస్టమ్‌లో అనేక సమస్యలు ఉన్నాయి.)
  • There were many people at the event. (ఆ కార్యక్రమంలో చాలా మంది ఉన్నారు.)

B) Sentences Beginning with “A number of” and “The number of”: “A number of” takes a plural verb, while “The number of” takes a singular verb. Although both expressions look similar, their meanings are different. “A number of” means “several or many” whereas “The number of” means the “total count”.

“A number of” బహువచన క్రియను తీసుకుంటుంది, అయితే “The number of” ఏకవచన క్రియను తీసుకుంటుంది. రెండు వ్యక్తీకరణలు ఒకేలా కనిపిస్తున్నప్పటికీ, వాటి అర్థాలు భిన్నంగా ఉంటాయి. “A number of” అంటే “అనేక లేదా అనేకమంది” అని అర్ధం, అయితే “The number of” అంటే “మొత్తం లెక్క” లేదా “మొత్తం సంఖ్య”.

Subject-verb-agreement_9

Examples:

  • A number of employees are working remotely this week. (ఈ వారం చాలా మంది ఉద్యోగులు రిమోట్‌గా పనిచేస్తున్నారు.)
  • A number of applicants were rejected after the interview. (ఇంటర్వ్యూ తర్వాత అనేక మంది దరఖాస్తుదారులు తిరస్కరించబడ్డారు.)
  • A number of students are absent today. (ఈ రోజు అనేక మంది విద్యార్థులు హాజరు కాలేదు.)
  • The number of employees is increasing every year. (ఉద్యోగుల సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతోంది.)
  • The number of mistakes in this report is alarming. (ఈ నివేదికలో తప్పుల సంఖ్య ఆందోళనకరంగా ఉంది.)
  • The number of vehicles on the road has doubled. (రోడ్డుపై వాహనాల సంఖ్య రెట్టింపు అయింది.)

C) Sentences Beginning with “Much”, “More”, and “Many”: These words are quantifiers, and the verb depends on whether they refer to countable or uncountable nouns.

“చాలా”, “మరిన్ని” మరియు “అనేక” లాంటి క్వాంటిఫైయర్ పదాలతో ప్రారంభమయ్యే వాక్యాలను ఇపుడు చూద్దాం. క్వాంటిఫైయర్లు అంటే ఇంగ్లీష్ వ్యాకరణంలో నామవాచకం యొక్క పరిమాణం (quantity), మొత్తం (amount) లేదా సంఖ్య (number) ను తెలిపే పదాలు. క్రియ అనేది అవి లెక్కించదగిన లేదా లెక్కించలేని నామవాచకాలను సూచిస్తాయా అనే దానిపై ఆధారపడి ఉంటుంది.

Examples:

  • Many students are participating. (చాలా మంది విద్యార్థులు పాల్గొంటున్నారు.)
  • Much time is needed. (చాలా సమయం అవసరం.)
  • More books are required. (మరిన్ని పుస్తకాలు అవసరం.)
  • More information is needed. (మరింత సమాచారం అవసరం.)
  • Many students are preparing for the examination. (చాలా మంది విద్యార్థులు పరీక్షకు సిద్ధమవుతున్నారు.)
  • Many opportunities have been lost due to poor planning. (సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల చాలా అవకాశాలు కోల్పోయాము.)
  • Much effort is required to complete this project. (ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడానికి చాలా కృషి అవసరం.)
  • More employees are joining the company this month. (ఈ నెలలో మరి కొంత మంది ఉద్యోగులు కంపెనీలో చేరుతున్నారు.)
  • More patience is needed to solve this problem. (ఈ సమస్యను పరిష్కరించడానికి మరింత సహనం అవసరం.)

10. Modal Auxiliary Verbs

When using the modal auxiliary verbs (can, could, will, would, shall, should, might, must, and ought to), you need not worry about using the singular or plural verb. Modal auxiliary verbs do not change their form according to the subject. The main verb that follows a modal is always in the base form. When we use modal auxiliary verbs, the modal remains the same for all subjects, and the verb after the modal stays in its base form.

మోడల్ సహాయక క్రియలను (can, could, will, would, shall, should, might, must, and ought to) ఉపయోగిస్తున్నప్పుడు, మీరు ఏకవచనం లేదా బహువచన క్రియను ఉపయోగించడం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మోడల్ సహాయక క్రియలు Subject (కర్త) ప్రకారం వాటి రూపాన్ని మార్చవు. మోడల్‌ను అనుసరించే ప్రధాన క్రియ ఎల్లప్పుడూ బేస్ రూపంలో ఉంటుంది. మనం మోడల్ సహాయక క్రియలను ఉపయోగించినప్పుడు, మోడల్ అన్ని సబ్జెక్టులకు, అన్ని పర్సన్ లకు ఒకే విధంగా ఉంటుంది మరియు మోడల్ తర్వాత క్రియ దాని బేస్ రూపంలో ఉంటుంది.

Examples:

  • This phone can capture professional-grade pictures. (‘phone’ is singular) [ఈ ఫోన్ ప్రొఫెషనల్-గ్రేడ్ చిత్రాలను తీయగలదు. (‘ఫోన్’ ఏకవచనం)]
  • Most phones can do that now. (‘phones’ is plural) [చాలా ఫోన్లు ఇప్పుడు అలా చేయగలవు. (‘ఫోన్లు’ బహువచనం)]
  • The prime minister will arrive in Japan next week. (ప్రధానమంత్రి వచ్చే వారం జపాన్‌కు చేరుకుంటారు.)
  • The other ministers will arrive shortly after that. (ఆ తర్వాత కొద్దిసేపటికే ఇతర మంత్రులు వస్తారు.)
  • She can solve the problem quickly. (ఆమె సమస్యను త్వరగా పరిష్కరించగలదు.)
  • They could finish the project before the deadline. (వారు గడువుకు ముందే ప్రాజెక్ట్‌ను పూర్తి చేయగలరు.)
  • The manager will approve the proposal tomorrow. (మేనేజర్ రేపు ఆ ప్రతిపాదనను ఆమోదించనున్నారు.)
  • I would help you if I had more time. (నాకు మరింత సమయం ఉంటే నేను మీకు సహాయం చేసేవాడిని.)
  • The students should submit their assignments on time. (విద్యార్థులు తమ అసైన్‌మెంట్‌లను సకాలంలో సమర్పించాలి.)
  • He might join the meeting later. (అతను బహుశా ఆ సమావేశంలో తరువాత జాయిన్ అవుతారు.)

If you want to know how the subject-verb agreement changes in different verb patterns, please read our blog on Verb Patterns in English.

Conclusion

Subject-verb agreement is the key point that holds your sentences together. While the basic rules are simple, the nuances of English grammar can make it tricky. Understanding the role of the subject and object helps in forming grammatically correct sentences. Correct subject-verb agreement improves clarity, confidence, and professionalism in both daily communication and business writing.

కర్త-క్రియ ఒప్పందం అనేది మీ వాక్యాలను కలిపి ఉంచే కీలక అంశం. ప్రాథమిక నియమాలు సరళమైనవి అయినప్పటికీ, ఆంగ్ల వ్యాకరణం యొక్క సూక్ష్మబేధాలు దానిని గజిబిజిగా చేస్తాయి, క్లిష్టతరం చేస్తాయి. కర్త మరియు కర్మ యొక్క పాత్రను అర్థం చేసుకోవడం వ్యాకరణపరంగా సరైన వాక్యాలను రూపొందించడంలో సహాయపడుతుంది. సరైన కర్త-క్రియ ఒప్పందం రోజువారీ సంభాషణ లలో మరియు వ్యాపార సంబంధ రాతలలో (ఇమెయిల్ లు, ఒప్పంద పత్రాలు) రెండింటిలోనూ స్పష్టత, ఆత్మవిశ్వాసం మరియు వృత్తిపరమైన నైపుణ్యాన్నిమెరుగుపరుస్తుంది.

By paying attention to prepositional phrases, mastering indefinite pronouns, and understanding collective nouns, you can elevate your English from “good enough” to professional and polished. Whether you are writing a text message or a business contract, the subject-verb agreement rules ensure your message is received exactly as you intended.

ప్రతిపాదక పదబంధాలపై శ్రద్ధ వహించడం, అనిర్దిష్ట సర్వనామాలను నేర్చుకోవడం మరియు సామూహిక నామవాచకాలను అర్థం చేసుకోవడం ద్వారా, మీరు మీ ఆంగ్లాన్ని “బాగుంది” నుండి వృత్తి పరంగా “చాలా బాగుంది” మరియు మెరుగుదిద్ద బడిన భాష గా చేయవచ్చు. మీరు ఒక టెక్స్ట్ సందేశం వ్రాస్తున్నా లేదా వ్యాపార ఒప్పందం వ్రాస్తున్నా, కర్త-క్రియ ఒప్పందం నియమాలు మీ సందేశం మీరు ఉద్దేశించిన విధంగానే అందుతుందని నిర్ధారిస్తాయి. 

Mastering this rule is especially important for business communication, academic writing, professional emails, competitive exams, interviews, etc. Regular practice with real-life examples will help you avoid common mistakes in subject-verb agreement and improve your grammar skills significantly.

ఈ నియమాన్ని పాటించడం అనేది వ్యాపార సంభాషణలు, విద్యా రచనలు, వృత్తిపరమైన ఇమెయిళ్ళు, పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలు మొదలైన వాటికి చాలా ముఖ్యం. నిజ జీవిత ఉదాహరణలతో క్రమం తప్పకుండా సాధన చేయడం వలన మీరు కర్త-క్రియ ఒప్పందంలో సాధారణ తప్పులను నివారించుకోవచ్చు మరియు మీ రచనా నైపుణ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు.

_________________________

Disclaimer: The names of individuals mentioned in blog posts, articles, examples, scenarios, case studies, etc., on this blog website are randomly selected for illustrative purposes only. Any resemblance to actual persons, living or deceased, or similarity to real names is purely coincidental and entirely unintentional. Also read the Disclaimer page.

Leave a Comment